కూతుళ్లకే పట్టం కట్టారు..! | - | Sakshi
Sakshi News home page

కూతుళ్లకే పట్టం కట్టారు..!

Sep 27 2026 12:52 AM | Updated on Sep 27 2026 12:52 AM

జోగుళాంబ గద్వాల

ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

ఆడబిడ్డ అని అధైర్యపడలేదు.. కూతురు అనే లింగ వివక్ష చూపలేదు.. వారిలోనే కుమారులను చూసుకుంటూ.. ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నారు పలువురు తల్లిదండ్రులు.. ఉన్నత విద్యకు బాటలు వేస్తూ.. ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు.. తల్లిదండ్రుల ఆశలయాలనే తమ కలలుగా భావించిన కూతుళ్లు సైతం పెద్ద పెద్ద చదువులు చదువుతూ.. జీవితంలో స్థిరపడుతూ.. తమ తల్లిదండ్రులను గర్వపడే స్థాయిలో నిలబెడుతున్నారు. ఆదివారం జాతీయ కూతుళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో స్ఫూర్తిగా నిలుస్తున్న పలువురు తల్లిదండ్రులు, కూతుళ్లపై ప్రత్యేక కథనం..

– గద్వాల/ అలంపూర్‌

ప్రస్తుత ఆధునిక కాలంలోనూ లింగవివక్ష చూపే సమాజంలో.. కూతురు అంటే ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులూ ఉన్నారు. మగపిల్లాడితో సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఉన్నత చదువులు చదివించి వారిని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబడేలా ప్రోత్సహించారు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యంతో తిరిగి అదే తండ్రికి బాసటగా నిలుస్తున్నారు ఈ కూతుళ్లు. గద్వాల పట్టణానికి చెందిన న్యాయవాది పి.శ్రీధర్‌కు ఇద్దరు కూతుళ్లు శ్రీనిత, శ్రీలేఖ. పెద్ద కూతురు శ్రీనిత పంజాబ్‌లోని రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పీజీ పూర్తి చేయగా.. చిన్న కూతురు శ్రీలేఖ హైదరాబాద్‌లోని సింబసియస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో ఎల్‌ఎల్‌బీ, నల్సార్‌ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పీజీ పూర్తి చేసింది. ప్రస్తుతం వీరు హైకోర్టులో న్యాయవాదులుగా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిలో పెద్ద కూతురు భర్త టాటా టెలీ సర్వీసెస్‌లో ఎంటర్‌ ప్రైజేస్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అదేవిధంగా చిన్న కూతురు శ్రీలేఖ భర్త సాయికిరణ్‌ ఐఏఎస్‌ అధికారిగా మహారాష్ట్రలోని భండారా జిల్లాలో సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ తండ్రి శ్రీధర్‌ ఆడపిల్లలు అనే బేధం లేకుండా ఎంతో ప్రేమ, ఆప్యాయతతో పెంచారని, అదేవిధంగా ఉన్నత చదువులు చదివించారని శ్రీనిత, శ్రీలేఖలు చెబుతున్నారు. అలాగే తల్లి సునీత కూడా తమకు అన్ని రకాలుగా అండగా నిలిచి.. ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడిందని పేర్కొన్నారు. తమను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు తండ్రి శ్రీధర్‌ చాలా కష్టాలు పడ్డారని వాటిని చూస్తూ పెరిగామని, తమ జీవిత చరమాంకం వరకు తల్లిదండ్రులకు అండగా నిలబడతామని ‘సాక్షి’కి తెలిపారు.

దుర్మార్గమైన పాలన

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గమైన పాలన సాగిస్తుందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

–8లో u

న్యాయ వ్యవస్థలో రాణింపు..

లింగవివక్ష చూపకుండా ఉన్నత విద్యకు దోహదం

తల్లిదండ్రుల ఆశయాలకు

అనుగుణంగా రాణిస్తున్న కూతుళ్లు

న్యాయవాదులుగా

సత్తాచాటుతున్న శ్రీనిత, శ్రీలేఖ

తండ్రి కోరిక నెరవేర్చిన హరితకుమారి

నేడు జాతీయ కూతుళ్ల దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement