కనుల పండువగా ఆదిశిలావాసుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా ఆదిశిలావాసుడి కల్యాణం

Sep 27 2026 12:52 AM | Updated on Sep 27 2026 12:52 AM

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రంలో శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిశిలావాసుడి కల్యాణోత్సవాన్ని వేదపండితులు మంత్రోచ్ఛరణాల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు మధుసూదనాచారి, రవిచారి స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవంను వైభవంగా చేపట్టారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అదేవిధంగా ఆదిశిలా వాసుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలోని సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement