పర్యాటక ప్రదేశాలపై విస్తృత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

పర్యాటక ప్రదేశాలపై విస్తృత ప్రచారం

Sep 27 2026 12:52 AM | Updated on Sep 27 2026 12:52 AM

గద్వాల న్యూటౌన్‌: విద్యార్థులు జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాల విశిష్టతను తెలుసుకొని, వాటి ప్రాధాన్యతపై సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వెలుగులోకి రాని పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని నిజాంకొండ, బీచుపల్లి, అలంపూర్‌ ఆలయాలను మరింత అభివృద్ది చేసేందుకు నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం టూరిస్టు గైడ్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి లభించడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు పర్యాటక రంగాన్ని ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారంగా చేసుకొని ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అనంతరం పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. అలాగే వైద్య కళాశాలలో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ మనోజ్‌ కుమార్‌రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రామలింగేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ షేక్‌ కలందర్‌ బాష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement