గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని, ఆర్‌అండ్‌ఆర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ భూములు కోల్పోయిన నిర్వాసితులకు నిర్దేశిత సమయంలోగా పరిహారం చెల్లించాలన్నారు. పెండింగ్ చెల్లింపులు, పెండింగ్ పనులకు ఆర్థిక అనుమతులు, టోకెన్లు ఇతర ఆర్థిక పరమైన కారణాలతో ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌డీసీ కృష్ణ, ట్రెయినీ డీసీలు మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
పర్యాటకరంగ అభివృద్ధికి కృషి
జిల్లాలోని అలంపూర్, నిజాంకొండ, గద్వాలకోట తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధికి చేసేందుకు కృషి చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న ఆయన జిల్లాలో పర్యాటక ప్రాంతాల వివరాలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, శిక్షణ డీసీలు రాజ్‌కుమార్, మనోజ్‌కుమార్‌రెడ్డి పర్యాటక శాఖ జిల్లా అధికారి రామలింగేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.


