డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం

Aug 28 2026 12:45 AM | Updated on Aug 28 2026 12:45 AM

గద్వాల న్యూటౌన్‌: డిమాండ్ల సాధనకు ఉద్యోగులు కదం తొక్కారు. గురువారంఽ టీజీజేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట మహధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారులు, పెన్షనర్లు, కార్మికులు పెద్దఎత్తున హజరై ధర్నాలో పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చేవరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని టీజీజేఏసీ జిల్లా చైర్మన్‌ నాగార్జునగౌడ్‌, కోచైర్మన్‌ గోపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత పీఆర్‌సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. 2వ పీఆర్‌సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.10 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా వచ్చేనెల 1న జిల్లా కేంద్రంలో, 10న హైదరాబాద్‌లో మరోసారి మహాధర్నా నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌కు అందజేశారు. కార్యక్రమంలో టీజీజేఏసీ నాయకులు ఆనంద్‌, ప్రభాకర్‌శాసీ్త్ర, లక్ష్మీరెడ్డి, మోహన్‌, రమేష్‌, ఎల్లస్వామి, బుచ్చన్న, లక్ష్మీనారాయణ, నాగేష్‌, విష్ణు, అబ్దుల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement