30న కేంద్ర మంత్రి రాక | - | Sakshi
Sakshi News home page

30న కేంద్ర మంత్రి రాక

Aug 28 2026 12:45 AM | Updated on Aug 28 2026 12:45 AM

ఉండవెల్లి: జోగుళాంబ ఆలయ సందర్శన, జోగుళాంబ హాల్ట్‌ పర్యవేక్షణకు గాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం విచ్చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ముందుగా ఆదివారం సాయంత్రం రోడ్డు మార్గంలో అలంపూర్‌ క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ప్రసాద్‌ స్కీం నిధులతో ఏర్పాటు చేస్తున్న లేజర్‌ లైట్‌ను వీక్షించి హరిత హోటల్‌లో బస చేస్తారన్నారు. అనంతరం సోమవారం జోగుళాంబ హాల్ట్‌ రైల్వేస్టేషన్‌ పనులను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీసి పర్యవేక్షిస్తారు. అనంతరం గద్వాలకు బయలుదేరి వెళ్తారు.

శ్రీశైలంలో 874.874 అడుగుల నీటిమట్టం

అచ్చంపేట: వర్షాభావ పరిస్థితలతో శ్రీశైలం జలాశయానికి వరదలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులో గురువారం సాయంత్రం 6 గంటలకు సమయానికి 874.874 అడుగుల వద్ద 159.3828 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 162.0554 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారు 3 టీఎంసీ మేర తగ్గిపోయింది. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 35,315 క్యూసెక్కులు నీరు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి రాయలసీమ తాగునీటి అవసరాలు, సాగునీటి పథకాల కోసం నీటిని తరలిస్తున్నారు. హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 8 వేలు ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోంది. కేఎల్‌ఐ ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది.

214 క్వింటాళ్ల

వేరుశనగ రాక

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు గురువారం 214 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.8,101, కనిష్టంగా రూ.5,149, సరాసరిగా రూ.6,881 ధరలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement