ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దమొత్తంలో ఈత వనాలు పెంచుతున్నాం. మందు కల్లు తయారీపై నిఘా పెట్టాం. తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ నిషేధిత ఆల్ఫ్రాజోలం ఇతరత్రా మత్తు పదార్థాలు కలిపితే కఠిన చర్యలు తప్పవు.
– విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎకై ్సజ్ శాఖ డీసీ, మహబూబ్‌నగర్
30 నుంచి 40 శాతం వరకు బాధితులే..
మందు కల్లుతో అనర్థాలు చాలా ఉన్నాయి. మోతాదు మించి మత్తు కల్పితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి వస్తున్న పేద రోగుల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మంది ఆల్కహాలిక్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారే.
– డాక్టర్ బాలశ్రీనివాస్, ఫిజీషియన్, జీజీహెచ్, మహబూబ్‌నగర్
●


