బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే నీటి లభ్యత పెరిగి పంటల సాగుకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి, రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి జాప్యం లేకుండా ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి. – శంకర్ లింగం, కొల్పూర్, మాగనూర్
సరిహద్దు గ్రామాల అభివృద్ధికి దోహదం..
బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయ మార్కెట్లకు రాకపోకలు సులభమవుతాయి. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుంది. – పోతుల రాముల, సర్పంచ్,
కొల్పూర్, మాగనూర్


