గద్వాల: జిల్లా విద్యుత్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన బదిలీలను రద్దు చేస్తూ సీఈ భిక్షపతి పేరిట ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ శాఖలో నలుగురు ఉద్యోగుల అక్రమ బదిలీల వ్యవహారంపై బుధవారం ‘సాక్షి’లో ‘పవర్’ పాలి‘ట్రిక్స్’ శీర్షి కన కథనం ప్రచురిత మైంది. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఉన్న తాధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేసిన నలుగురు ఉద్యోగుల బదిలీలను రద్దు చేస్తూ సీఈ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్
కేటీదొడ్డి: మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకోలేని రైతులు మీసేవ కేంద్రాల్లో బుకింగ్ చేసుకోవాలని ఈడీఎం శివకుమార్ తెలిపారు. పాసుబుక్ నంబర్, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేశాక రైతు ఫోనుకు ఓటీపీ వస్తుందని, వెరిఫై చేశాక బుకింగ్ ఐడీ జారీ అవుతుందన్నారు. ఈ ఐడీకి బుకింగ్ తేదీ మినహాయించి.. 48 గంటలు వ్యాలిడిటీ ఉంటుందన్నారు. ఈ సదుపాయాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
పల్లీ @ రూ.7,465
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం 888 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,465, కనిష్టంగా రూ.3,396, సరాసరిగా రూ.5,769 ధరలు లభించాయి.
హస్తకళలకు ప్రోత్సాహం
కోస్గి రూరల్: ప్రకృతి సిద్ధంగా లభించే వనరులతో వస్తువులను తయారుచేసే చేతివృత్తిదారులను ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుంద ని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ అధికారి అరవింద్ అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో చేతివృత్తిదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాలు, గృహ నిర్మాణాల్లో చేతివృత్తిదారులు ముఖ్యభూ మిక పోషిస్తున్నట్లు తెలిపారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గు ర్తించి.. మరింత నైపుణ్యం పెంపొందిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గుర్తింపుకార్డుల కోసం పలు కుల సంఘాల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు.


