ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న మత్స్యకారులు 5,800
మత్స్యపారిశ్రమిక సహకార సంఘాలు 96
సొసైటీల్లో సభ్యత్వం లేకుండా మత్స్య వృత్తిపై ఆధారపడిన వారు సుమారు
1,300- 1,500
మొత్తం సభ్యుల
సంఖ్య
7,300
ఈ రిజిస్ట్రేషన్‌తోనే పథకాలు
ఎన్‌ఎఫ్‌డీపీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మత్స్యకారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టే పథకాలు ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే వర్తిస్తాయి. ప్రధానంగా ప్రమాద బీమా, బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. సామాజిక భద్రత, ఆర్థిక చేయూత లభిస్తుంది.
– వెంకట్రాములు, చెన్నకేశవస్వామి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు
ప్రోత్సాహకాలు బాగు..
మత్స్యకారులు అందరూ ఎన్‌ఎఫ్‌డీపీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొసైటీలో సభ్యత్వం లేని వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వివిధ రూపాల్లో వీరంతా చేపల వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అందిస్తున్న పథకాలు, ప్రోత్సహకాలు బాగున్నాయి.
– వెంకటేష్, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు, బీరెల్లి
అవగాహన కల్పిస్తున్నాం..
సొసైటీలో సభ్యత్వం ఉన్న మత్స్యకారులతోపాటు సభ్యత్వం లేకపోయినా.. చేపల పెంపకం, విక్రయం, వలల తయారీ, అమ్మకం, ఐస్‌బాక్స్‌లు తయారు చేసేవారు కూడా ఎన్‌ఎఫ్‌డీపీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనిపై వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పించాం. ఇంకా ఎవరైనా చేసుకోలేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లలో లేదా జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సిబ్బంది ద్వారా చేయించుకోవాలి.
– షకీలాభానో, జిల్లా మత్స్యశాఖాధికారి
●


