● అలంపూర్– అయిజ, ఎరిగేర 57 కి.మీ, గద్వాల– ఎర్రవల్లి 9 కి.మీ., బలిగెర– మాచర్ల 5 కి.మీ., గద్వాల– రాయచూర్ 22 కి.మీ., గట్టు– మాచర్ల 5 కి.మీ., 6 ప్రధాన రహదారుల విస్తరణ
● వనపర్తి– ఆత్మకూర్ రహదారిలో పరిధిలో 0 నుంచి 31కి.మీ., వరకు బీటీ రోడ్డు, ఆత్మకూర్– మరికల్ రోడ్డు 13.40 కి.మీ. విస్తరణ
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రహదారులను విస్తరించడంతోపాటు మరమ్మతు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హ్యామ్ విధానం ద్వారా రహదారులను అభివృద్ధి చేయనుంది. దీంతో జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల ముఖచిత్రం మారబోతోంది. ఇందులో భాగంగా మొదటి దశలో మహబూబ్‌నగర్ ఆర్‌అండ్‌బీ సర్కిల్‌లో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి 2 ప్యాకేజీల్లో మొత్తం 378.04 కి.మీ., మేర రోడ్లను నిర్మించనున్నారు. అలాగే వనపర్తి సర్కిల్‌లో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో మొదటి దశలో 18 రహదారులను 2 ప్యాకేజీల కింద ఎంపిక చేసిన మొత్తం 319.4 కి.మీ., మేర నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా చివరి దశలో ఉంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు ద్వారా రుణం పొంది రోడ్లను నిర్మిస్తారు.కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్ నిర్మించిన రహదారులను 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ సర్కిళ్ల వారీగా నిర్మించే హ్యామ్ రోడ్లు..
జిల్లా ప్యాకేజీలు రోడ్ల కి.మీ., వ్యయం
సంఖ్య (రూ.కోట్లలో)
మహబూబ్‌నగర్ 2 26 378.04 912.67
వనపర్తి 2 18 319.4 697.77
హ్యామ్ రోడ్లలో ఉమ్మడి పాలమూరుకు పెద్దపీట
నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ
రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రణాళిక
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం
మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం
ఎంపిక చేసిన రోడ్లు ఇవే..
బుద్దారం నుంచి మరికల్ వరకు 33 కి.మీ., రోడ్డును 10 మీటర్లుగా విస్తరించి ఆధునికీకరించనున్నారు. వనపర్తి– బుద్దారం 11.60 కి.మీ., రోడ్డు స్టెతన్ చేయనున్నారు.
మంగనూర్ నుంచి తెలకపల్లి వరకు 45.50 కి.మీ రోడ్డును ఆధునికీకరణ.
బల్మూర్– నాగర్‌కర్నూల్ (పీడబ్ల్యూడీ) 13 కి.మీ., రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ.
ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ వరకు 28.40 కి.మీ. మేర రెండు వరుసలు.
పదర, వంకేశ్వరం, చిట్లంకుంట, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి వరకు 34.20 కి.మీ., సింగిల్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ.
పెంట్లవెల్లి ఎక్స్‌రోడ్డు నుంచి కొండూరు, తూంకుంట మీదుగా శ్రీరంగాపూర్ వరకు 0 నుంచి 3 కి.మీ., మేర రెండు వరుసలుగా విస్తరణ, 3 నుంచి 28.16 కి.మీ వరకు డబుల్ లైన్ తారు పునరుద్ధరణ పనులు.
చిన్నంబావి– చెల్లెపాడు 14.20 కి.మీ., రోడ్డును ఆధునికీకరణ.
కొల్లాపూర్– వనపర్తి మధ్య కేతేపల్లి నుంచి వీపనగండ్ల వరకు 11.10 కి.మీ., సింగిల్ రోడ్డును డబుల్‌గా విస్తరణ
మహబూబ్‌నగర్– నవాబ్‌పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్– మినాస్‌పూర్ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్– నారాయణపేట (ఊట్కూర్ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్– తిర్మలాపూర్ 10 కి.మీ., మహబూబ్‌నగర్– మంగనూర్, వేపూర్ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్‌పల్లి, కురుమూర్తి టెంపుల్ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్‌కొండ (మల్కాపూర్, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు.


