అన్నిరకాలుగా చేయూత..
చేపల వృత్తిపై ఆధారపడిన మత్స్యకారులకు అన్ని రకాల చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ఎన్‌ఎఫ్‌డీపీని తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకునే మత్స్యకారులకు ప్రభుత్వం పలు పథకాలు, ప్రోత్సహకాలు అందించనుంది. ప్రధానంగా పీఎంఎంఎస్‌వై, ఇతర మత్స్య పథకాల్లో సబ్సిడీలు పొందవచ్చు. ప్రమాద బీమా, సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుంది. రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. చేపల వేట పరికరాలు, వాహనాలు ఇతర మత్స్య పరికరాలపై సబ్సిడీలు పొందవచ్చు. ప్రభుత్వ నిర్వహించే శిక్షణ శిబిరాలు, అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొనవచ్చు. విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రభుత్వ సహాయం పొందవచ్చు. ప్రత్యేకంగా గుర్తింపు కార్డు కూడా వస్తుంది. ఇలా ఎన్‌ఎఫ్‌డీపీలో వివరాలు నమోదు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు ప్రయోజనాలు ఉన్నాయి. కాగా సొసైటీలో సభ్యత్వం ఉన్న మత్స్యకారులతోపాటు చేపల వృత్తిలో ఉన్న మత్స్యకారులందరూ ఎన్‌ఎఫ్‌డీపీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్షేత్రస్థాయిలో ప్రచారం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్‌ఎఫ్‌డీపీపై జిల్లా మత్స్యశాఖ విస్తృత ప్రచారం కల్పిస్తోంది. సొసైటీలో ఉన్న మత్స్యకారులతోపాటు చేపల వృత్తిపై ఆధారపడిన మత్స్యకారుల వివరాలను ఎన్‌ఎఫ్‌డీపీ పోర్టల్ మత్స్యశాఖ సిబ్బంది నమోదు చేస్తున్నారు. చా లామంది మత్స్యకారులు కామన్ సర్వీస్ సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటుండగా.. అలా చేయించుకోలేని వారి రిజిస్ట్రేషన్‌లను జిల్లా కార్యాలయంలో సిబ్బంది చేస్తున్నారు.
మత్స్యకారులకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పిస్తున్న ఎన్‌ఎఫ్‌డీపీ
గద్వాల వ్యవసాయం: చేపల వృత్తి జీవనాధారంగా ఉన్న మత్స్యకారులకు ఎన్‌ఎఫ్‌డీపీ (నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం) రిజిస్ట్రేషన్ సామాజిక, ఆర్థిక భరోసా ఇస్తోంది. పలు పథకాలు, ప్రోత్సకాలు అందించే ఈ పథకాన్ని కేంద్రం రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టినప్పటికీ చాలామంది మత్స్యకారులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల దీనిపై ప్రత్యేక దృష్టిసారించింది. చేపల వృత్తిలో ఉన్న ప్రతి మత్స్యకారుడు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
జిల్లాలో నీటి వనరులు..
నడిగడ్డ ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్, శ్రీశైలం బ్యాక్‌వాటర్, ఆరు రిజర్వాయర్లు, 35 నోటిఫైడ్ చెరువులతోపాటు 396 చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు. చేపల పెంపకం, విక్రయంపైనే జీవనం సాగుతోంది. ఇది కాక కొంతమంది మత్స్యకారులు సొంతంగా కూడా చేపల చెరువులను నిర్వహిస్తున్నారు. 2018– 19లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతో మత్స్యకారులకు రూ.2 కోట్లు విలువ చేసే ద్విచక్రవాహనాలు, ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు, ట్రేలు, ఐస్‌బాక్స్‌లు, వలలు, ఎలక్ట్రానిక్ కాంటాలు తదితరమైనవి సమకూరాయి. వీటితో మత్స్యకారులకు కొంత ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు.
పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి అన్నివిధాల ప్రోత్సాహం
రెండేళ్ల క్రితమే పథకం ప్రారంభమైనా అవగాహన కరువు
ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారుల చర్యలు
గత ప్రభుత్వం అమలు చేసిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంతోనూ మేలు


