గందరగోళంగా ఉంటది.. | - | Sakshi
Sakshi News home page

గందరగోళంగా ఉంటది..

Jul 9 2026 6:29 AM | Updated on Jul 9 2026 6:29 AM

గట్టులోని బీసీకాలనీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో అన్ని తరగతుల పిల్లలను ఒకేచోట కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. అన్ని తరగతుల సబ్జెక్టులను అందరూ వినడం వల్ల గందరగోళం నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి.. అదనపు గదులు నిర్మించాలి.

– ఆంజనేయులు, గట్టు

సెలవు కోసం తిప్పలు..

సింగిల్‌ టీచర్‌ ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు అత్యవసర పరిస్థితుల్లో సెలవు కోసం పై అధికారిని బతిమిలాడుకోవాల్సి వస్తుంది. ఆ స్థానంలో పక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయుడిని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుని వెళ్లమని చెబుతున్నారు. ఇది ఇబ్బందికర పరిస్థితి. సింగిల్‌ స్కూళ్లకు ఇద్దరు టీచర్లను కేటాయించాలి. కనీసం విద్యావలంటీర్లను ఏర్పాటు చేస్తే సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది.

– చంద్రకాంత్‌ వదన్‌, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

వలంటీర్ల నియమిస్తాం..

ఇప్పటికే విద్యాశాఖపై అధికారులతో సమీక్షను నిర్వహించాం. ఉపాధ్యాయుల కొరతపై మండలాల వారీగా ఎంఈఓలతో వివరాలు సేకరిస్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావలంటీర్లను నియమించేలా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

– నర్సింగ్‌రావు, అదనపు కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement