ధరూరు: ర్యాలంపాడు పునరావాస కేంద్రంలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 8న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవా రం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ర్యాలంపాడు పునరావాస కేంద్రాన్ని సందర్శించి.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. మొత్తం 256 ఇళ్లు మంజూరు కాగా.. 50 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, రామన్‌గౌడ్, శేఖర్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.


