మొక్కజొన్న అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వెళ్తే.. గన్నీ బ్యాగులు లేవని చెప్పారు. అప్పుడేమో అధికారులు బ్యాగులు తెచ్చుకున్న రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పారు. సరే అనుకొని కొంటే రూ.30 పడిన బ్యాగుకు ఇప్పుడు కేవలం రూ.15 ఇస్తున్నారు. ఎటు తిరిగి రైతులకే నష్టం వస్తుంది. – రాముడు, రైతు, వడ్డేపల్లి
రూ.31 తీసుకున్నారు..
ధాన్యం అమ్ముకునేందుకు కేంద్రాల దగ్గర పడిగాపులు కాశాను. నా ధాన్యం అమ్మే సమయానికి సంచులు లేవని చెప్పి, మళ్లీ వారం ఆలస్యం చేశారు. దీంతో మార్కెట్‌లో ఒక్కో సంచి రూ.31 చొప్పున 717 సంచులు కొన్నాను. ఇప్పుడేమో అధికారులు రూ.15 ఇస్తున్నారు. కొనుగోలు సమయంలో ఆన్‌లైన్ చేద్దామంటే.. రెండు వారాల దాక ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించలేదు.
– మహేంద్ర, రైతు, శాంతినగర్
●


