అలంపూర్‌ ఆలయాల్లో కేంద్రమంత్రి | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌ ఆలయాల్లో కేంద్రమంత్రి

Feb 23 2026 7:11 AM | Updated on Feb 23 2026 7:11 AM

అలంపూ

అలంపూర్‌ ఆలయాల్లో కేంద్రమంత్రి

అలంపూర్‌: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం అలంపూర్‌ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అలంపూర్‌ హరితహోటల్‌ వద్ద కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వాగతం పలికి.. శాలువాలతో సత్కరించి పూలబొకే అందజేశారు. అనంతరంపోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఆలయాలకు వెళ్లి.. కేంద్రమంత్రి దంపతులు అభిషేకం, కుంకుమార్చన, ఇతర ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు వారికి శేషవస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. స్వామి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. జోగుళాంబ దేవిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అని, మరోసారి అమ్మవారి దర్శనానికి వస్తానని ఈ సందర్భంగా కుమారస్వామి పేర్కొన్నారు. ● కేంద్రమంత్రి పర్యటనను పురస్కరించుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ మొగిలయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఈఓ దీప్తి, మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌ ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

అలంపూర్‌ ఆలయాల్లో కేంద్రమంత్రి 1
1/1

అలంపూర్‌ ఆలయాల్లో కేంద్రమంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement