
ఆంజనేయస్వామిని దర్శించుకుంటున్న భక్తులు
ఎర్రవల్లిచౌరస్తా: అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయం సోమవారం అంజన్న నామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అభయాంనేయస్వామికి ఆకుపూజ, పంచామృత అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు ఉదయాన్నే బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించారు.
అనంతరం భక్తిశ్రద్ధలతో అభయాంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ఎదుట కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ ఈఓ రామన్‌గౌడ్ పేర్కొన్నారు.