భూపాలపల్లి అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాంజలి పథకం కింద కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆరుగురు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. కెనరా బ్యాంకు భూపాలపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ ప్రమీల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. ఐదు, ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


