తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న | - | Sakshi
Sakshi News home page

తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

తండ్రి బాధ్యత నెరవేర్చిన అన్న తల్లీతండ్రి అన్నీ.. అన్నే! ఏటా ఒకచోట వేడుకలు రాఖీ కోసం ఆస్ట్రేలియా నుంచి..

ఆస్తికంటే చెల్లిపై ప్రేమ ఎక్కువ

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కష్టమే రానివ్వనని ఒకరు. ఆపదొస్తే అండగా నిలుస్తానని మరొకరు. నీకు నేనున్నానంటూ ఇంకొకరు.. తోబుట్టువుకు సగం ఆస్తి రాసిచ్చిన అన్న ఒకరు. అక్కతో రాఖీ కట్టించుకోవడానికి విదేశాల నుంచి సొంతూరికి వచ్చిన తమ్ముడొకరు. ఇలా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. రాఖీ పండుగకు అసలైన అర్థం చెబుతున్న వీరందరి గురించి రక్షాబంధన్‌ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ.

కాశిబుగ్గ: కొత్తవాడకు చెందిన దువ్వ సాంబమూర్తి–రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా, ఒక కుమారుడు రాజ్‌కుమార్‌, కుమార్తె శీరిష ఉన్నారు. వికలాంగుడైన తండ్రి సాంబమూర్తి కుమార్తె పెళ్లి చేసిన తర్వాత మరణించాడు. చెల్లెలిపై ప్రేమతో అన్న రాజ్‌కుమార్‌ (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌) చెల్లి, బావకు కొత్తవాడలోని ఇంట్లోనే నివాసం కల్పించాడు. చెల్లెలిపై ప్రేమతో ఆరునెలల క్రితం పుర ప్రముఖుల సమక్షంలో 180 గజాల ఇల్లు స్థలంలో సగం 90 గజాల స్థలం రిజిస్ట్రేషన్‌ చేసి, కాగితాలు అప్పగించాడు. చెల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్‌కుమార్‌ను అందరూ అభినందిస్తున్నారు.

లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన నక్కపల్లి ప్రసాద్‌ తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చెల్లెళ్లను ఉన్నత చదువులు చదివించాడు. అతడి చెల్లెళ్లు రాజేశ్వరి, అరుణ పెళ్లిళ్లు చేశాడు. అమ్మానాన్నల లోటు లేకుండా పెంచి పెద్ద చేసిన అన్న ప్రసాద్‌ అంటే వారికి ఎనలేని ప్రేమ. ఎక్కడున్నా అన్నకు ప్రతీ ఏడాది రాఖీ కడతారు. చెల్లెళ్లకు సైతం ప్రసాద్‌ తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు.

ఎస్‌ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన దుబ్బాక శ్రీనివాస్‌కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్‌ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు.

డోర్నకల్‌: డోర్నకల్‌లోని బ్యాంక్‌ స్ట్రీట్‌కు చెందిన కాలా యశోధర్‌ జైన్‌కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్‌జైన్‌కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు.

పర్వతగిరి: పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీపాద వెంకటేశ్వర్లు, సరోజ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు శ్రీపాద సురేశ్‌ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి ప్రతీ సంవత్సరం పర్వతగిరికి వస్తుంటాడు. మిగిలిన నలుగురు అన్నదమ్ములు సతీశ్‌, రఘు, రవి, రాము పర్వతగిరికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు. ఐదుగురు అన్నదమ్ములంటే తనకు ప్రాణమని ఏటా వారికి రాఖీ కడతానని ప్రియాంక చెబుతోంది.

తండ్రి ప్రేమను పంచిన పలువురు అన్నలు

ఆస్తి కాదు.. అనుబంధమే ముఖ్యమంటున్న ఓ సోదరుడు అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తున్న సోదరులు

రాఖీ కట్టి రక్షగా నిలుస్తామంటున్న సోదరీమణులు నేడు రాఖీ పౌర్ణమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement