మహాముత్తారం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు. మండలంలోని ములుగుపల్లి, దుంపిల్లపల్లె, మహాముత్తారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండల పరి షత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఇందిరమ్మ లబ్ధిదారులకు హక్కుపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘాలకు భవనాల నిర్మాణం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచితంగా సొంత ఖర్చులతో కుట్టు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 300 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కాటారంలో నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. కొత్తపల్లి నుంచి మహాముత్తారం రోడ్డు నిర్మాణానికి పెగడపల్లి నిమ్మగూడెం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, పీఆర్ ఈఈ విద్యాసాగర్, డీఈ సాయిలు, సీడీపీఓ రాధిక, ఉపాధిహామీ సభ్యులు రమేష్, ఏఎంసీ చైర్మన్ తిరుమల, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ప్రకాశ్‌రెడ్డి, తహసీల్దార్ దండు శ్రీనివాస్, మహాముత్తారం సర్పంచ్ బాపు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సడువలి పాల్గొన్నారు.
సీఎం సోదరుల పేరుపై
పరిశ్రమల భూకేటాయింపు జరగలేదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులకు పరిశ్రమల కోసం రాష్ట్రంలో ఎక్కడా భూములు కేటాయింపు జరగలేదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ అర్వింద్, మరికొన్ని బీఆర్‌ఎస్ చానల్‌ళ్ల సీఎం సోదరులకు తక్కువ రేటుకు భూముల కేటాయించినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారి బోర్డు మీటింగుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎండీ, ఈడీలు సీఎం సోదరుల పేరిట ఎక్కడా ఒక్క ఇంచు భూమిని కేటాయించలేదని స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో చట్టం చేసిన ఎన్‌డీఎస్‌ఏ.. తగిన సూచనలు సలహాలతో ముందుకు పోతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
మల్హర్(కాటారం): పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాాటారం ఎంపీడీఓ కార్యాలయంలో 5 మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం అందజేశారు.
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి పర్యటనలో అపశృతి
మహాముత్తారం: మంత్రి శ్రీధర్‌బాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ములుగుపల్లి పర్యటన ముగించుకుని మండల కేంద్రానికి చేరుకున్న క్రమంలో శ్రీధర్‌బాబు కాన్వాయ్‌లోని ఓ కారు డోర్ తీసేసమయంలో వెనుక నుంచి వచ్చిన బైక్ డోర్‌కు తాకింది. దీంతో బైక్‌పై ఉన్న బోర్లగూడెం గ్రామానికి చెందిన నవరాంనాయక్‌కు తలకు తీవ్రగాయాలు కాగా మండల కేంద్రానికి చెందిన సకినాల రాజుకు కాళ్లకు తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లిలోని వందపడకల ఆస్పత్రికి తరలించారు. మంత్రి శ్రీధర్‌బాబు క్షతగాత్రులను పీహెచ్‌సీలో పరామర్శించారు.


