
యూరియా కోసం బారులు
కాటారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గోదాంకు మూడు రోజుల తర్వాత మంగళవారం ఉదయం 400 బస్తాల యూరియా వచ్చింది. దీంతో వెంటనే సుమారు 400 మందికి పైగా రైతులు ఒక్కసారిగా గోదాం ఎదుట బారులుదీరారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు, అధికారులు రైతులను నియంత్రించారు. ఒక్కో రైతుకు రెండు మూడు బస్తాలు పంపిణీ చేశారు. దీంతో లైన్లలో నిల్చున్న రైతులకు అందరికీ యూరియా అందలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెనుదిరిగారు.
– కాటారం
పీఏసీఎస్ గోదాం ఎదుట బారులుదీరిన రైతులు

యూరియా కోసం బారులు