
పూజలు చేసి.. వంతెనపై నుంచి దూకి
కాళేశ్వరం: మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారని.. తమ ఇష్ట దైవమైన కొండయ్య మహారాజ్ చిత్రపటానికి పూజ చేసి ఓ వ్యక్తి కాళేశ్వరం వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతయ్యాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మండిగ బాపు (75) మంగళవారం కాళేశ్వరం చేరుకున్నాడు. అంతర్రాష్ట్ర వంతెన ఫుట్‌పాత్‌పై తమ ఇష్టదైవమైన కొండయ్య మహారాజ్ చిత్రపటానికి కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టాడు. ఆ తర్వాత చెప్పులు వంతెన గోడపై వదిలి గోదావరిలోకి దూకాడు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపారు. గల్లంతైన వృద్ధుడి కుమారుడు రాజబాపు ఫిర్యాదు మేరకు ఎస్సై తమాషారెడ్డి కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి వెంట ఉన్న తన సోదరుడు చిన్నబాపును పోలీసులు విచారిస్తున్నారు. ఆయనకు భార్య వీరలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గోదావరిలో గల్లంతైన వ్యక్తి కోసం
పోలీసుల గాలింపు

పూజలు చేసి.. వంతెనపై నుంచి దూకి