
మహిళా భద్రత కోసం ఉమెన్ బ్లూ కోల్ట్స్
● ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: మహిళా భద్రత కోసం ఉమెన్ బ్లూ కోల్ట్స్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఉమెన్ బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ద్విచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలకు ఎల్లవేళలా రక్షణ అందించేందుకు ఈ టీంలు సహకరిస్తాయని అన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.