
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇంటింటా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్‌రావు అన్నారు. టీజీఐఎల్‌పీ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తిలో పండ్లు, వెదురు మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. వెదురు మొక్కల పెంపకం లాభదాయకంగా ఉంటుందన్నారు. దత్తత గ్రామం కొండపర్తి అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీపీఎంలు రాజు, శ్రీనివాస్, తాడ్వాయి సెర్ప్ ఏపీఎం కిషన్, టీజీఐఎల్‌పీ జిల్లా కోఆర్డినేటర్ వెంకన్న, మండల కోఆర్డినేటర్ యాదగిరి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంపత్‌రావు