
వైద్యులు అందుబాటులో ఉండాలి
పలిమెల: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాటారం సబ్ మయాంక్‌సింగ్ వైద్యాధికారులకు సూచించారు. మండలంలోని నీలంపల్లి గ్రామాన్ని మంగళవారం కాటారం సబ్ మయాంక్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సబ్ సెంటర్, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, సబ్ సెంటర్ నిర్మాణస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలతో రోగాల ప్రబలే అవకాశం ఉండటంతో క్రమంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రకాశ్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ కల్యాణి, ఎంఈఓ, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి పీటర్ పాల్, ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్