
‘సురవరం’ మరణం తీరనిలోటు
భూపాలపల్లి అర్బన్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మరణం సీపీఐ, వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఆయన మృతిపై సీపీఐ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ప్రజా సమస్యలు, సంక్షేమానికి ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు గురిజెపల్లి సుధాకర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, సతీష్, సుగుణ, రాంచందర్, ఆసిఫ్‌పాషా, చంద్రమౌళి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్