
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
● సూపరింటెండెంట్ ఇంజనీర్
మల్చూర్ నాయక్
భూపాలపల్లి రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటూ, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సర్కిల్‌లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలను విని పరిష్కరించడానికి విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 358 లూజ్ లైన్లు పునరుద్దరించామని, 682 ఒరిగిన స్తంభాలు సరి చేశామని, 2,216 మధ్య స్థంబాలు నెలకొల్పామని తెలిపారు. 292 లోలెవెల్ లైన్ క్రాసింగ్ డబల్ ఫీడింగ్ పాయింట్లను మార్చమని తెలిపారు. జీరో ప్రమాదాలే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీనంబర్ ద్వారా సంప్రదించాలని మల్చర్ నాయక్ సూచించారు.
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ప్రతీ ఆదివారం స్వామివారికి నిర్వహించే తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.
గణపతి రుద్రుడిగా
రుద్రేశ్వరస్వామికి అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని గణపతి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు పానుగంటి ప్రణవ్, పెండ్యాల సందీప్‌శర్మ ఉదయం నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతి ఆరాధన, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈవిద్యాసంవత్సరం 2025–26 లో డిగ్రీ, పీజీ ప్రవేశాలు పొందాలని ఆ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు కోరారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర్లు ఆ యూ నివర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల అధ్యయన కేంద్రాలను వేర్వేరుగా సందర్శిచారు. ప్రవేశాల పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బీఏ,బీకాం,బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈనె ల 30 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. కేడీసీలో పోస్టర్ల ఆవి ష్కరణ కార్యక్రమంలో కేడీసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆలువాల సంజీవయ్య, అధ్యాపకులు డాక్టర్ బి.వెంకటగోపీనాథ్, ఎం.సదానందం, సురేశ్, పూర్ణచందర్, దుర్గం రవి, రమేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు