
ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహిద్దాం
కాళేశ్వరం: వినాయక నవరాత్రులు వచ్చాయంటే అందరిలో ఉత్సాహం నెలకొంటుంది. ప్రతి ఏడాది విగ్రహాల పరిమాణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విగ్రహాల తరలింపులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి విద్యుత్‌శాఖ సిబ్బందికి, మండపాల నిర్వా హకులకు పలు సూచనలు చేసి అలర్ట్ చేస్తున్నారు. పట్టణాల నుంచి పల్లెల దాకా ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈనేపథ్యంలో నవరాత్రులు ముగిసేవరకు పలు సూచనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
● విగ్రహాల ఎత్తుకు అనుగుణంగా రూట్‌ని నిర్ణయించుకోవాలి. ఎక్కడైనా సమస్యలు ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
● విద్యుత్ లైన్లకు కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి. లైన్‌లో ప్రవహించే విద్యుత్ సరఫరా ప్రభావం, ఇండక్షన్ రెండు అడుగుల వరకు ఉంటుంది.
● ఎత్తయిన విగ్రహాల తరలింపులో మరింత అప్రమత్తంగా ఉండాలి.
● మెటల్ ఫ్రేమ్లతో కూడిన డెకరేషన్లను వీలైనంత వరకు తగ్గించాలి.
● మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించి వారితోనే చేయించాలి.
● ఐఎస్‌ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలి. ఎలాంటి జాయింట్ వైర్లు వాడొద్దు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది.
● మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ వైర్లు, పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి.
● ఎవరికై నా విద్యుదాఘాతం తగిలితే వెంటనే వైద్యసాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
● వైరింగ్‌లో ఎక్కడైనా లీకేజీ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమ వలన విద్యుదాఘాతం తగిలే ప్రమాదం ఉంటుంది. మండపాల నిర్వాహకులు ప్రతి రోజూ తప్పనిసరిగా వైరింగ్‌ను పరిశీలించాలి.
వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోర్టల్‌లో చేసుకోవాలి. ప్రమాదాలకు చోటులేకుండా పండుగను ప్రశాంత వాతావారణంలో జరుపుకోవాలి. కమిటీలు, ప్రజలు సహకరించాలి. ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలి. ప్రతి విగ్రహానికి జియోట్యాగింగ్ ఉంటుంది.
– పవన్‌కుమార్, ఎస్సై, మహదేవపూర్
జిల్లా వ్యాప్తంగా
గణపతి నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు
విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తలు
పాటించాలంటున్న అధికారులు
వీలైనంతగా తక్కువ ఎత్తు విగ్రహాలు ప్రతిష్ఠించాలని సూచన

ఉత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహిద్దాం