
హాస్టల్ సిబ్బందిని జైలుకు పంపాలి
భూపాలపల్లి రూరల్: తాగునీటిలో పురుగుల మందు కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన సిబ్బందిని జైలుకు పంపాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం 100 పడకల ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న హాస్టల్ విద్యార్థులను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డితో కలిసి ఆమె పరామర్శించి మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జై ల్లో వేయాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేందర్, రవికిరణ్, ఉపాధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, రవి,రాజయ్య, సయ్యద్ గాలిఫ్, రవీందర్, రాజు నాయక్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం కేసు నమోదుచేయాలి
హాస్టల్‌లో తాగునీటిలో పురుగులమందు కలిపిన ఉపాధ్యాయుడినిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించి కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం సభ్యులు దిలీప్, పాలకుర్తి శ్రీనివాస్, కర్ణాటక సమ్మయ్య, చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విధ్యార్థులను ఆదివారం బృందం సభ్యులు పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సంఘటన వివరాలు సేకరించిన అనంతరం మాట్లాడారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను, పాఠశాలకు చేరుకుని పాఠశాలలో ఉన్న విద్యార్థుల ద్వారా వివరాలు సేకరించామన్నారు. విద్యార్థులు పేర్కొన్నట్లు సంఘనటకు బాధ్యుడైన ఉపాధ్యాయుడు రాజేందర్, ఇతర బాధ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి