
యూరియా తిప్పలు
కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని ఆగ్రోస్ సెంటర్‌కు శుక్రవారం 444 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు సెంటర్‌కు భారీగా తరలివచ్చి లైన్లలో నిల్చున్నారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున సిబ్బంది పంపిణీ చేశారు. లైన్లలో నిల్చున్న రైతులందరికీ యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీఎస్‌కు నాలుగు రోజుల క్రితం 420 బస్తాల యూరియా రాగా మిషన్‌లో సాంకేతిక లోపంతో పంపిణీ చేయడంలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– రేగొండ (కొత్తపల్లిగోరి)