గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

Mar 27 2025 1:23 AM | Updated on Mar 27 2025 1:18 AM

భూపాలపల్లి: వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే మున్సిపల్‌ కార్యాలయంలోని కాల్‌ సెంటర్‌ 8978180036కు ఫోన్‌ చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌ బిర్రు శ్రీనివాస్‌ వెల్లడించారు. పట్టణ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ ఇన్‌ నిర్వహించగా అనూహ్య స్పందన లభించింది. మున్సిపల్‌ పరిధిలోని పలువురు తమ సమస్యలను కమిషనర్‌కు ఫోన్‌లో వివరించగా, కొన్నింటిని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.

ప్రశ్న: సెంట్రల్‌ లైటింగ్‌ లైట్లు వెలగక ప్రమాదాలు జరుగుతున్నాయి.

– ముంజాల రవీందర్‌,

మాజీ కౌన్సిలర్‌, మంజూర్‌నగర్‌

కమిషనర్‌: సెంట్రల్‌ లైటింగ్‌ మరమ్మతుకు నోచుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లగా డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేయించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.

ప్రశ్న: హనుమాన్‌నగర్‌ సమీపంలోని పోచమ్మగుడి వద్ద డివైడర్‌ కటింగ్‌ను మరింత వెడల్పు చేయాలి. మెయిన్‌ రోడ్‌లోని ప్రధాన ఆస్పత్రి, మజీద్‌ దగ్గర మిషన్‌ భగీరథ వాటర్‌ లీకేజీ అయి దుకాణాల ఎదుట నీరు పారుతుంది.

– మహ్మద్‌ రఫీక్‌, ఫొటో స్టూడియో యజమాని, హనుమాన్‌నగర్‌

కమిషనర్‌: డివైడర్‌ కటింగ్‌ను వెడల్పు చేసే విషయాన్ని ఎన్‌హెచ్‌ అధికారులకు లేఖ ద్వారా తెలియజేస్తాం. వాటర్‌ లీకేజీ కాకుండా తక్షణమే చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: సుభాష్‌కాలనీలోని వారసంత జరిగే స్థలం పక్కన సైడ్‌ కాల్వలు లేక మురుగు నీరు రోడ్డుపై పారుతుంది.

– అనపర్తి లక్ష్మణ్‌, సుభాష్‌కాలనీ

కమిషనర్‌: డ్రెయినేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. తాత్కాలికంగా అక్కడ సిమెంట్‌ పైపులు వేస్తాం.

ప్రశ్న: జంగేడులోని ఓపెన్‌ జిమ్‌ను మరమ్మతు చేయించాలి

– కూచన కిషన్‌ప్రసాద్‌, జంగేడు, 14వ వార్డు

కమిషనర్‌: మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఓపెన్‌ జిమ్‌ల మరమ్మతుకు ప్రతిపాదనలు పంపిస్తాం.

ప్రశ్న: మంజూర్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి గుడి వెనుక కాలనీలో సైడ్‌ కాల్వలు లేక ఇబ్బంది పడుతున్నాం.

– మంథెన సత్యనారాయణ, పసుల శ్రీనివాస్‌, వెంకటేశ్వర కాలనీ

కమిషనర్‌: అక్కడ సుమారు 300 మీటర్ల మేరకు సైడ్‌ కాల్వ నిర్మించాల్సి ఉన్నట్లుగా గుర్తించాం. ఏప్రిల్‌ నెలలో ఎస్టిమేట్‌ తయారు చేపిస్తాం.

ప్రశ్న: సుభాష్‌కాలనీలో పది లైన్లకు కలిపి ఒకే వాల్వ్‌ ఉంది. దీంతో మిషన్‌ భగీరథ నీరు చాలా నెమ్మదిగా, తక్కువగా వస్తున్నాయి.

– చుక్క బాలరాజు, సుభాష్‌కాలనీ.

కమిషనర్‌: నేను స్వయంగా అక్కడికి వచ్చి చూస్తాను. మరో రెండు వాల్వ్‌లను తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా.

ప్రశ్న: శాంతినగర్‌ 18వ వార్డులో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు పందులకు ఆవాసంగా మారుతున్నాయి.

– ప్రభుదాస్‌, శాంతినగర్‌

కమిషనర్‌: ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి స్థలాలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: రెడ్డికాలనీలో చెత్త సేకరణకు ప్రతీరోజు రావడం లేదు.

– రాజేందర్‌రెడ్డి, రెడ్డికాలనీ

కమిషనర్‌: శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు చెప్పి ప్రతీరోజు చెత్త వాహనాలు వచ్చేలా చూస్తాం.

ప్రశ్న:అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి ఓసీపీ 2 వరకు నిర్మిస్తున్న రహదారి పనులు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

– భీమనాధుని సత్యనారాయణ, రెడ్డికాలనీ

కమిషనర్‌: ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేసేలా చూస్తాం.

ప్రశ్న: నోటీసులు ఇవ్వకుండా నా ఇళ్లు కూలగొట్టారు.

– పుల్యాల తిరుపతి, సుభాష్‌కాలనీ

కమిషనర్‌: సైడ్‌ కాల్వ నిర్మించాల్సిన స్థలంలో మీరు ఇంటి నిర్మాణం చేపట్టారు. నోటీసులు ఇచ్చి కొంత మేరకు తొలగించాం. సైడ్‌ కాల్వ నిర్మాణానికి సహకరించాలి.

ప్రశ్న: మంజూర్‌నగర్‌ మెయిన్‌ రోడ్డుకు మూడేళ్లుగా పైప్‌లైన్‌ ద్వారా తాగునీరు అందించడం లేదు.

– లక్ష్మణ్‌నాయక్‌, మంజూర్‌నగర్‌

కమిషనర్‌: ఏఈని పంపించి మిషన్‌ భగీరథ నీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.

న్యూస్‌రీల్‌

ప్రశ్న: ఓసీపీ 2 (పాత కేటీకే 2వ ఇంక్‌లైన్‌) నుంచి అంబేడ్కర్‌ మీదుగా బొగ్గు లారీలు వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మిలీనియం క్వార్టర్స్‌లోని పెద్ద రోడ్డు నుంచి కేటీకే 5వ ఇంక్‌లైన్‌ వరకు సింగరేణి నిర్మించిన రోడ్డు మీదుగా లారీలను నడిపిస్తే ఇబ్బంది ఉండదు.

– గంపల దేవేందర్‌, సుభాష్‌కాలనీ

కమిషనర్‌: రెండు రోజుల్లో సింగరేణి జీఎం, ఎస్పీ గారికి లేఖ రాసి మిలీనియం క్వార్టర్స్‌, కేటీకే 5వ ఇంక్‌లైన్‌ మీదుగా బొగ్గు లారీలు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం.

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 20251
1/2

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 20252
2/2

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement