కలెక్టర్‌గా రాహుల్‌ శర్మ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా రాహుల్‌ శర్మ

Published Sun, Jun 16 2024 1:30 AM | Last Updated on Sun, Jun 16 2024 1:30 AM

కలెక్టర్‌గా రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: కలెక్టర్‌ భవేష్‌మిశ్రా బదిలీ అయ్యారు. వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ కలెక్టర్‌గా నియమితులయ్యారు. భవేష్‌మిశ్రా 2021 అక్టోబర్‌ 24న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2 సంవత్సరాల 7 నెలల 21 రోజులు పనిచేశారు. ఈయన ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంలో తనవంతు కృషిచేశారు. కొత్త కలెక్టర్‌ రాహుల్‌ శర్మ స్వగ్రామం పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌. పటియాలలోని తాపూర్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. తండ్రి అమృత్‌సర్‌లోని హిందూ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. తల్లి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. రాహుల్‌శర్మ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాక డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్టస్‌లో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేశారు. 2017లో ఐఏఎస్‌ అయ్యారు. నల్లగొండ అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. రెండు నెలల పాటు కలెక్టర్‌(ఎఫ్‌ఏసీ)గా పనిచేశారు. అనంతరం వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌గా వెళ్లారు. సీఎస్‌ శాంతికుమారి రాహుల్‌శర్మను భూపాలపల్లి కలెక్టర్‌గా బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. నేడు ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకొని బాధ్యతలు స్వీకరించనున్నారు.

నేడు బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత కలెక్టర్‌ భవేష్‌మిశ్రా బదిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement