జనగామ: షాపులో లక్ష్మీపూజ చేస్తున్న వ్యాపారులు
జనగామ రూరల్: పొదుపు సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. స్వయం సహాయ సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేస్తూ పెద్దపీట వేస్తోంది. బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి రుణాల ద్వారా ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తోంది. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్‌లు, ఎరువుల షాపుల నిర్వహణ అమలు చేస్తోంది. ఈక్రమంలో నిధులు దుర్వినియోగం కాకుండా ఖాతా వివరాల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ప్రతీ సభ్యురాలికి ఈ– కేవైసీ తప్పనిసరి చేసింది. సభ్యుల సమగ్ర సమాచారం జాతీయ స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ‘లోకస్’ యాప్‌తో అనుసంధానం చేస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, అనర్హులను తొలగించడమే లక్ష్యంగా వీఓఏలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ప్రతీ సభ్యురాలి ఈ–కేవైసీని పూర్తి చేస్తున్నారు.
62శాతం పూర్తి..
జిల్లా వ్యాప్తంగా 1,05627 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. ప్రతీ సభ్యురాలికి ఈ–కేవైసీని గ్రామ సమాఖ్య సహాయకులు చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు జిల్లాలో 62,670 మంది సభ్యుల ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు 62శాతం లక్ష్యం నమోదు చేశారు. ఇప్పటికే సంఘాల వారీగా రుణాలు, చెల్లించిన వాయిదాలు, వడ్డీ రాయితీ, చేస్తున్న బిజినెస్ సమాచారం సెర్చ్ వెబ్‌సైట్‌లో పొందు పరుస్తున్నారు. ఈ–కేవైసీ పూర్తికావడం వల్ల నిధుల అవకతవకలకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా లింగాల ఘణపురం మండలం 82 శాతం పూర్తి చేసుకోగా తరిగొప్పుల 75 శాతం రెండో స్థానంలో నిలిచింది. అత్యల్పంగా 45శాతంతో స్టేషన్ ఘన్‌పూర్ మండలం, కొడకండ్లలో 55 శాతం పూర్తిచేశారు.
వివరాలు మ్యాచ్ కావాలి..
ఆధార్ సమాచారం సరిగా లేకపోతే ఈ–కేవైసీ కాదు. ఫోన్ నంబర్‌కు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఫొటో కూడా సరిపోవాలి. ఆధార్‌లో ఉన్న ఐరీష్ మ్యాచ్ అయితేనే ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంతో బోగస్ సభ్యులు ఉండే అవకాశం ఇకపై ఉండదు. అంతేకాకుండా ఒకరి స్థానంలో మరొకరు ఉండడం కూడా కుదరదు. సభ్యురాలిగా ఉన్నవారు మాత్రమే ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలను అధిగమించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ అధికారులు, వీఓఏలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. దీంతో ఈ కేవైసీ ప్రక్రియ త్వరిగతిన సాగుతోంది.
మండలాల వారీగా మొత్తం సభ్యులు, ఈకేవైసీ వివరాలు
సభ్యులు
పూర్తయిన శాతం
66.67%
75.96%
58.97%
62.2%
63.98%
82.62%
63.33%
62.24%
60.86%
55.82%
11,528
45.56%
55.06%
6,437
12,298
9,853
9,594
9,004
5,083
10,275
4,747
7,997
8,588
రఘునాథపల్లి
లిం.ఘణపురం
దేవరుప్పుల
జనగామ
బచ్చన్నపేట
జఫర్‌గఢ్
చిల్పూర్
కోడకండ్ల
పాలకుర్తి
తరిగొప్పుల
నర్మెట
స్టే.ఘన్‌పూర్
10,222
స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఈ–కేవైసీ
ఇప్పటివరకు 62 శాతం పూర్తి
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సభ్యుల నమోదు
నిధుల రక్షణకు తోడ్పాటు
లోకస్ యాప్‌లో వివరాల నమోదు
మరింత సమర్థవంతంగా పథకాల అమలు


