బచ్చన్నపేట: రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేఽశంలో ఉన్న బచ్చన్నపేట మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం నుంచి 60 శాతం నిధులు ఇప్పించే బాధ్యత తనదేనని పేర్కొన్నారు, మండలంలోని కొన్నె గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి, రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేశ్, బల్ల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బంగారం మహేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గద్ద రాజు, సర్పంచ్‌లు బేజాడి సిద్ధులు, గీస సందీప్, తదితర నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్


