కంప్యూటర్‌ విద్యపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ విద్యపై దృష్టి సారించాలి

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

బచ్చన్నపేట : పాఠశాల విద్యార్థులు కంప్యూటర్‌ విద్యపై దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మండలంలోని పోచన్నపేట ఎంపీపీఎస్‌ను బుధవారం సందర్శించిన ఆయన కంప్యూటర్‌ ల్యాబ్‌ (ఏఎక్స్‌ఎల్‌)ను ప్రారంభించారు. పాఠశాల విద్యాబోధన, మౌళిక సదుపాయాలు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు వేశారు. కట్టెల పొయ్యిపై మధ్యాహ్న భోజనం వండకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్యాస్‌ పొయ్యిపై వండాలని సూచించారు. విద్యార్థులను ఆరు బటయ కూర్చోబెట్టకుండా తరగతి గదుల్లో మాత్రమే ఉంచాలని హెచ్‌ఎంకు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ ఇర్రి వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ ఎండీ.ఫిరోజ్‌, హెచ్‌ఎం అమృత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణకు కార్యచరణ

జనగామ రూరల్‌: జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఉద్యాన తోటల పెంపకంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 590 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు జరుగుతోందని, దానిని మరింత విస్తరించేందుకు రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ను 430 ఎకరాల వరకు సరఫరా చేసినట్లు అధికారులు వివరించారు. మహిళా సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎంఐడీహెచ్‌ పథకం కింద సీడ్‌ ప్రాసెసింగ్‌ విస్తరించాలన్నారు. తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగుపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఇందుకోసం గుర్తించిన 24 మహిళా సంఘాలకు శిక్షణ, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి, ఉత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో వెదురు, అరటి తోటల పెంపకానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. అరటి సాగులో ఎకరానికి 1,100 మొక్కలు, మొక్కకు మొక్కకు మధ్య 1.8 మీటర్ల దూరం పాటించేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీహెచ్‌ఎస్‌ఓ నర్సయ్య, డీఆర్‌డీఓ భాస్కర్‌, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement