బాలికల క్రీడా ప్రతిభకు రగ్బీ వేదిక | - | Sakshi
Sakshi News home page

బాలికల క్రీడా ప్రతిభకు రగ్బీ వేదిక

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

పాలకుర్తి టౌన్‌: గ్రామీణ ప్రాంత బాలికల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రగ్బీ వంటి పోటీలు దోహదపడతాయని సీఐ భరత్‌ సుమన్‌ అన్నారు. మండలంలోని చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అస్మిత రగ్బీ సిటీ టోర్నమెంట్స్‌ ఆధ్వర్యంలో బుధవారం బాలికలకు –15, 18 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి అవకాశాలు పొందేందుకు ఈ పోటీలు ఉపకరిస్తాయని తెలంగాణ రగ్బీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ శేషు అన్నారు. కార్యక్రమంలో రగ్బీ జిల్లా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దొంతమల్ల గణేష్‌, కొండ రవి, మామిండ్ల సోంమల్లు, బాలబోయిన సందీప్‌, రావుల కుమారస్వామి, జోగు సంతోష్‌, సుష్మిత, నరేష్‌, పుస్కూరి రమేష్‌, జంపల పుష్పలీల, కారుపోతుల వేణు, కళింగరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.

చెన్నూరులో జిల్లాస్థాయి అస్మిత

రగ్బీ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement