జనగామ: వినాయక నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా, సజావుగా జరిగేలా జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ చెరుకు సంపత్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిమజ్జన ఏర్పాట్లలో విద్యుత్ సేవలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్) ఏర్పాటు చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సరఫరా పునరుద్ధరించేందుకు మొబైల్ ట్రాలీ డీటీఆర్‌లను సిద్ధంగా ఉంచామన్నారు. జనగామ నెల్లుట్ల చెరువు, ఘన్‌పూర్ పుట్టలమ్మ చెరువు, పాలకుర్తి తొర్రూరు (జి) ప్రాంతాల్లో ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలతోపాటు ఊరేగింపు మార్గాల్లో 24 గంటల పాటు విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచి పర్యవేక్షణ చేపడుతున్నారు. భారీ వినాయక విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ లైన్లకు సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఈ సూచించారు. విద్యుత్ అత్యవసర పరిస్థితుల్లో 1912కు కాల్ చేయాలని సూచించారు. ఆయన వెంట డీఈ లక్ష్మినారా యణరెడ్డి తదితరులు ఉన్నారు.
● ఎస్‌ఈ సంపత్‌రెడ్డి


