డిసెంబర్‌ 31లోగా వంద పడకల ఆసుపత్రి | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 31లోగా వంద పడకల ఆసుపత్రి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని డిసెంబర్‌ 31వరకు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు 2027 నూతన సంవత్సర కానుకగా అందించే సంకల్పంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. డివిజన్‌కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.20లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌రే యూనిట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేవరకు ఏరియా ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారని, ప్రస్తుతం ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించామని, త్వరలోనే డయాలసిస్‌ సెంటర్‌, ఆపరేషన్‌ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంఎల్‌టీ, ఏఎన్‌ఎం కోర్సులు ఏర్పాటు చేయిస్తే పిల్లలకు చదువుకు ఉపయోగంగా ఉండటంతో పాటు ఏరియా ఆసుపత్రిలో ట్రైనింగ్‌ తీసుకోవచ్చన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైతే ఈ విద్యాసంవత్సరంలోనే సదరు కోర్సులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నీల రాజమ్మగట్టయ్య, ఏఎంసీ చైర్మన్‌ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఆర్‌.నరేందర్‌, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంధ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ, ఆర్‌ఎంఓ డాక్టర్‌ ప్రదీప్‌, వైద్యులు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

నూతన సంవత్సరానికి కానుకగా

అందిస్తా..

ఎక్స్‌రే యూనిట్‌ ప్రారంభించిన

సందర్భంగా ఎమ్మెల్యే కడియం

Advertisement
 
Advertisement
Advertisement