ప్రయాణికుల సమస్యలపై కలెక్టర్‌ ఆరా | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల సమస్యలపై కలెక్టర్‌ ఆరా

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

ప్రయాణికుల సమస్యలపై కలెక్టర్‌ ఆరా

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పరిశీలించారు. ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి వారి గమ్యస్థానాలు, బస్సుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు. మండుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తాగునీటి వసతులను పరిశీలించిన ఆయన ట్యాప్‌ వద్దకు వెళ్లి నీరు తాగి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నడుస్తున్న బస్సు సర్వీసులు, ప్రయాణికుల ఇబ్బందులపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో బస్సులను పంపించాలని డీఎంను ఆదే శించారు. బస్టాండ్‌లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement