తక్షణం స్పందించాలి.. | - | Sakshi
Sakshi News home page

తక్షణం స్పందించాలి..

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

తక్షణం స్పందించాలి..

జిల్లా ఆస్పత్రి, చంపక్‌హిల్స్‌ మాతా శిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లో కుక్క, కోతి కాటు వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో ఉన్నాయి. కుక్క, కోతి కాటుకు గురైన వెంటనే గాయమైన చోట సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాలి. ముందుగా టీటీ ఇంజక్షన్‌ వేసిన తర్వాత, ఈ కాటుకు సంబంధించిన రేబిస్‌ ఇంజక్షన్‌ వ్యాక్సిన్‌ వేస్తారు. తక్షణం స్పందించడం వల్ల భవిష్యత్తులో రేబిస్‌ వ్యాధి సోకే అవకాశం ఉండదు. కాటుకు గురైన వారం రోజుల తర్వాత ట్రీట్‌మెంటు చేయించుకుంటే, 10 ఏళ్ల తర్వాత కూడా రేబిస్‌ వచ్చే చాన్స్‌ ఉంది. ఇలాంటివారు ప్రతీ సంవత్సరం కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

– డాక్టర్‌ రాజలింగం, సూపరింటెండెంట్‌, జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి

Advertisement
 
Advertisement
Advertisement