నేడు ఎక్స్‌రే యూనిట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు ఎక్స్‌రే యూనిట్‌ ప్రారంభం

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఎక్స్‌రే సౌకర్యాలు లేకపోవడంతో పేరుకే పెద్దాసుపత్రిగా మారింది. వివిధ సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారు ఎక్స్‌రే కోసం రౖపైవేటు ఆసుపత్రులను ఆశ్రయించేవారు. అయితే గత నెలలో ఘన్‌పూర్‌ సీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్‌ ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలను అందించాలని ఆదేశించారు. గతంలో ఆసుపత్రిలో ఉన్న పాత ఎక్స్‌రే మిషన్‌ చెడిపోయి మూలకుపడటంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో అధునాతనమైన నూతన ఎక్స్‌రే మిషన్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు. కాగా సదరు ఎక్స్‌రే యూనిట్‌ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సంధ్య తెలిపారు.

సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ఎక్స్‌రే మిషన్‌

Advertisement
 
Advertisement
Advertisement