పక్కాగా టోకెన్‌ విధానం అనుసరించాలి | - | Sakshi
Sakshi News home page

పక్కాగా టోకెన్‌ విధానం అనుసరించాలి

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

లింగాలఘణపురం: పక్కాగా టోకెన్‌ విధానాన్ని అనుసరిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని కుందారంలో మక్కలు, వనపర్తి, నేలపోగుల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తుందని, నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దన్నారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం

జనగామ రూరల్‌: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రత్యేక ఎర్త్‌ డే పోస్టర్‌ను కలెక్టర్‌ చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గౌసియా బేగం, శ్రీనివాస్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌

సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement