రఘునాథపల్లి: మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్ సేవలు ఎంతో కీలకమని, డీసీసీ బ్యాంకు అధికారులు సకాలంలో మహిళలకు, రైతులకు రుణాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) నూతన బ్రాంచ్‌ను ఆమె ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించి మాట్లాడారు.. ఉమ్మడి జిల్లాలో 39 డీసీసీబీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడం, బంగారు రుణాల రూపంలోనే రూ.541 కోట్ల రుణాలు అందించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వరంగల్ డీసీసీబీ ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థగా ప్రజాసేవలో ముందంజలో ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 30 మహిళా సంఘాల గ్రూపులకు రూ 2.50 కోట్ల రుణాల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డు డీడీఎంలు చంద్రశేఖర్, చైతన్య రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ బొల్లం ఉమారాణిరాజీవ్, బ్రాంచ్ మేనేజర్ కోట సతీష్‌కుమార్, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, బెలిదె నాగన్న, కోళ్ల రవిగౌడ్, ఏపీఎం వెనీల, సీసీలు ఎల్లస్వామి, రీనావతి, మినుమల పద్మ, పాల్గొన్నారు.
ఎంపీ కడియం కావ్య
డీసీసీబీ నూతన బ్రాంచ్ ప్రారంభం


