● అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్
జఫర్‌గఢ్: సజావుగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సూచించారు. మండలంలోని తిమ్మంపేట గ్రామంలో నూతనంగా ప్రారంభమైన కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మహిళా సంఘాల సభ్యులు, రైతులతో మాట్లాడారు.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఏపీఎం కుమారస్వామితో పాటు మహిళ సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయ సందర్శన
చిల్పూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) బెన్ షాలోమ్ మంగళవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్ధార్ విజయ్‌కుమార్, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్‌లతో కలిసి చిల్పూరు, రాజవరం, దేశాయితండా గ్రామాల్లో కేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆర్‌ఐ తూలూరి లోకేష్, రైతులు ఉన్నారు.


