
వేడుకలకు సిద్ధం
● మినీ స్టేడియంలో పంద్రాగస్టు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
● ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
జనగామ: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియం సర్వంగ సుందరంగా ముస్తాబైంది. డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జనగామ ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీవో పీడీ వసంత, విజయ డెయిరీ డైరెక్టర్ గోపాల్‌సింగ్, తహసీల్దార్ హుస్సేన్, యువనజన, క్రీడల శాఖ అధికారి వెంకట్‌రెడ్డి ఉన్నారు.
షెడ్యూల్ ఇదే..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రభుత్వ విప్ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం 9.35నుంచి 9.40 మధ్య పోలీస్ శాఖ గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.40 నుంచి 9.50 గంటల మధ్య పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగే పరేడ్‌ను వీక్షిస్తారు. 9.50 నుంచి 10గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విప్ బీర్ల అయిలయ్య ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసాపత్రాల అందజేత ఉంటుంది.