
సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి
జనగామ: పట్టణంలోని బతుకమ్మకుంట సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం శుక్రవా రం అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.1.50 కోట్లతో వాకింగ్ ట్రాక్, లైట్స్, చిల్డ్రన్ పార్క్ తదిత ర సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ వెంట ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్‌రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
అత్యవసరమైతేనే బయటకు రావాలి
రఘునాథపల్లి: భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. గురువారం మండలంలోని బానాజీపేటలో కాజ్‌వేపై ప్రవహిస్తున్న వాగును పరిశీలించారు. కాజ్‌వే దెబ్బతినగా..నాణ్యత లేని రివిట్‌మెంట్ నిర్మాణంపై ఆరా తీశారు. మండలంలో వరదల పరిస్థితిపై తహసీల్దార్ ఫణికిషోర్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్‌లో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 90523 08621కు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.
పరిశీలించిన కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా