
అమృత బార్‌లో చోరీ
జనగామ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ప్రధాన కూడలిలోని అమృతబార్‌లో బుధవారం చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై భరత్, బార్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న రాత్రి బార్ మూసి వేసి ఇంటికి వెళ్లిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తి బార్ వెనకభాగం నుంచి లోనికి వచ్చి కౌంటర్‌లోని సుమారు రూ.2.50లక్షలు ఎత్తుకెళ్లారు. బుధవారం బార్ సిబ్బంది వచ్చి చూసేసరికి కౌంటర్‌లోని నగదు కనిపించలేదు. దీంతో యజమానితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌టీం అక్కడకు చేరుకుని చోరీ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. బార్ క్యాషియర్ రూ.2.50లక్షలు ఉండవచ్చని అంటుండగా పోలీసులు రూ.1.20 లక్షలుగా ప్రాథమిక అంచనా వేశారు. బార్ క్యాషియర్ ఆకారపు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.