
మృతులకు నివాళి అర్పించి..
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్‌ఎస్ రథసారథి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు.
పహల్గాం మృతులకు సంతాపంగా మౌనం పాటిస్తున్న కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండా ప్రకాశ్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి తదితరులు