
అకాల వర్షం.. ఆగమాగం
● మార్కెట్‌లో స్వల్పంగా తడిసిన ధాన్యం
జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. జనగామ మార్కెట్‌లో ధాన్యం నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమైంది. అప్రమత్తమైన రైతులు డోజర్లు, జేసీబీలతో పాటు రెక్కల కష్టాన్ని నమ్ముకుని ధాన్యంతోపాటు కాటన్ యార్డులోని మక్కలను ఒక్కచోటకు చేర్చి టార్పాలిన్ కవర్లు కప్పారు. మార్కెట్ నిండా ధాన్యం ఉండడంతో అక్కడక్కడా వర్షానికి తడిసింది. భారీ వర్షం కురిసినా నష్టం జరగకుండా ఉండేలా చైర్మన్‌తో పాటు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. – జనగామ

అకాల వర్షం.. ఆగమాగం