ఫోరెన్సిక్‌ సాక్ష్యాలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్‌ సాక్ష్యాలకు ప్రాధాన్యం

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి

జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత

జగిత్యాలజోన్‌: కీలక కేసుల్లో ఫోరెన్సిక్‌ సాక్ష్యాలకు కోర్టుల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో ప్రోబ్‌ ల్యాబ్స్‌ ఫోరెన్సిక్‌ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్‌ సాక్ష్యాలకు సంబంధించిన విషయాలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కేసుల విచారణలో ప్రత్యక్ష సాక్షులతోపాటు ఫోరెన్సిక్‌ వంటి శాసీ్త్రయమైన ఆధారాలకు అధిక విలువ ఇస్తాయని, నేరం జరిగిన తీరు, నిందితుడి గుర్తింపునకు మద్దతుగా నిలుస్తాయని, వేలిముద్రలు, డీఎన్‌ఏ పరీక్షలు, చేతిరాతలు ఆ రంగాల్లో నిపుణులు ఇచ్చే నివేదికలను సాక్ష్యంగా పరిగణించే అవకాశం ఉంటుందని వివరించారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ టెక్నాలజీ రంగంలోనూ మాయాజాలాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు బట్టబయలు చేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత మాట్లాడుతూ.. నేరం జరిగిన స్థలంలో సీజ్‌ చేసిన వస్తువులు, అక్కడ లభించే ఆధారాలు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడం ద్వారా నేర సంబంధిత విషయాల్లో కచ్చితత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రోబ్‌ ల్యాబ్‌ ఫోరెనిక్స్‌ ఎండీ ఎర్రగోల్ల మోహన్‌ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి నేరం చేశాడా..? లేదా అనే విషయాలను సందేహాలకు తావులేకుండా నిరూపించడానికి ఫోరెన్సిక్‌ పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు సత్యం, న్యాయవాదులు పాల్గొన్నారు.

భయపడి అఘాయిత్యాలు దాచొదు

అఘాయిత్యాలకు పాల్పడి.. ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరిస్తే అలాంటివి తల్లిదండ్రులకు చెప్పాలని న్యాయ సేవాసంస్థ కార్యదర్శి మట్ట సరిత సూచించారు. జిల్లాకేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అసౌకర్యం కలిగించే విషయాలను కుటుంబ సభ్యులతోపాటు నమ్మకమైన ఉపాధ్యాయులకు వివరించాలన్నారు. బాలికలలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కటుకం చంద్రమోహన్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేశ్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ అనురాధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement